'26న పెళ్లి చేసుకోవడం లేదు' | Asin denies getting married on November 26 | Sakshi
Sakshi News home page

'26న పెళ్లి చేసుకోవడం లేదు'

Published Mon, Oct 26 2015 12:51 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

'26న పెళ్లి చేసుకోవడం లేదు' - Sakshi

'26న పెళ్లి చేసుకోవడం లేదు'

తన వివాహ తేదీపై మీడియాలో వచ్చిన వార్తలను హీరోయిన్ అసిన్ తోసిపుచ్చింది. వచ్చే నెలలో తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. అసిన్, రాహుల్‌ శర్మ వివాహం నవంబర్ 26న ఢిల్లీలో జరగనుందని మీడియాలో వార్తలు వచ్చాయి.

'ఇది నిజంగా నవ్వు తెప్పించే వార్త. మేమింకా ముహూర్తమే పెట్టుకోలేదు. నా పెళ్లి తేదీపై మీడియా గందరగోళం సృష్టిస్తోంది. నేను అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాతే మా పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఎప్పుడనేది నేను చెప్పేవరకు ఓపిక పట్టండి' అని అసిన్ కోరింది.

మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్‌ శర్మను ఆసిన్ పెళ్లిచేసుకోనుంది. కాగా, నేడు ఆసిన్ 31వ పడిలోకి అడుగుపెడుతోంది. బర్త్ డే సెలబ్రేషన్ కోసం కాబోయే వధూవరులు గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లారట. తనకు కాబోయే భార్యకు రాహుల్‌ శర్మ ఖరీదైన ఉంగరం బహూకరించనున్నాడని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement