'అమితాబ్ స్పెషల్' ఈద్ ముబారఖ్.. | B-town wishes Eid Mubarak | Sakshi
Sakshi News home page

'అమితాబ్ స్పెషల్' ఈద్ ముబారఖ్..

Published Fri, Sep 25 2015 12:24 PM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

'అమితాబ్ స్పెషల్' ఈద్ ముబారఖ్.. - Sakshi

'అమితాబ్ స్పెషల్' ఈద్ ముబారఖ్..

ముంబై: బక్రీద్ పండుగ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు తమ అభిమానులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దువా కోరుతున్నట్లున్న ప్రత్యేక ఫొటోతో 'ఈద్ ముబారఖ్.. ఈ పండుగ అందరికి శాంతి, ప్రేమ, సంతోషాలను పంచాలి' అంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక పండగ పూట కూడా విరామం లేకుండా 'దిల్వాలే' షూటింగ్ లో ఉన్న షారూఖ్ ఖాన్.. 'ఈద్ అల్ అదా శుభాకాంక్షలు. అల్లాహ్ దయ, ఆశీర్వాదాలతో అందరికి మంచి ఆరోగ్యం, సంపదలు కలగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు.

 

అందరికీ బక్రీద్ శుభాకాంక్షలంటూ మాధురీ దీక్షిత్.. 'ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ జరుపుకొంటున్నవారికి శుభాకాంక్షలు. అల్లాహ్ శాంతి, సమామరస్యాల్ని ప్రసాదించాలి' అంటూ న్యాయార్క్ లో ఉన్న ప్రియాంక చోప్రా ట్వీట్లు చేశారు. వీరేకాక అనుష్క శర్మ, సోనాక్షి సిన్హా, అర్జున్ రాంపాల్, హుమా ఖురేషీ, ఆతియా షెట్టి, రవీనా టాండన్, సుస్మితా సేన్,  సోహా అలీఖాన్ తదితరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement