ఫ్రాన్స్ లో విడుదలకానున్న బహుబలి! | Baahubali - The Beginning will be releasing in France | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ లో విడుదలకానున్న బహుబలి!

Published Sat, Apr 30 2016 6:37 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఫ్రాన్స్ లో విడుదలకానున్న బహుబలి! - Sakshi

ఫ్రాన్స్ లో విడుదలకానున్న బహుబలి!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బాహుబలి'. ఈ మూవీ వచ్చే జూన్ 8న ఫ్రాన్స్ లో విడుదల కానుంది. ఈ మేరకు బాహుబలి పేరుతో ఉన్న అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జేసూస్ బాహుబలి అనే పేరుకు హ్యాష్ ట్యాగ్ పెట్టి, 'బాహుబలి - ది బిగినింగ్' విడుదల వివరాలను పోస్ట్ లో పేర్కొన్నారు.  ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఎన్నో సంచలనాలు నమోదు చేస్తూ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బాహుబలి విడుదలై రికార్డుల వర్షం కురిపించింది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టెర్ ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఈ మూవీ రెండో భాగం షూటింగ్స్ లో బిజిగా ఉన్నాడు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ ఫ్రాన్స్ లో విడుదలై మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆ మూవీ యూనిట్ భావిస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement