డబుల్ సెంచరీ 'కిక్' కొట్టాడు! | bajarangi bhaijan crosses 200 crore mark on kick anniversary | Sakshi
Sakshi News home page

డబుల్ సెంచరీ 'కిక్' కొట్టాడు!

Published Sat, Jul 25 2015 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

డబుల్ సెంచరీ 'కిక్' కొట్టాడు!

డబుల్ సెంచరీ 'కిక్' కొట్టాడు!

తన సినిమా మొదటి వార్షికోత్సవం రోజున.. తన మరో సినిమా రికార్డు సృష్టించడం అంటే ఎవరికైనా ఆనందమే కదా. సరిగ్గా ఇదే ఆనందాన్ని ఇప్పుడు సల్మాన్ ఖాన్ అనుభవిస్తున్నాడు. తెలుగు కిక్ సినిమాకు రీమేక్గా హిందీలో అదే పేరుతో తీసి బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకున్న సల్మాన్.. ఆ సినిమా వార్షికోత్సవం రోజున బజరంగీ భాయీజాన్ 200 కోట్ల మార్కును అందుకున్నాడు. సరిగ్గా శనివారం రోజునే ఈ 200 కోట్ల క్లబ్లోకి సల్మాన్ బజరంగీ చేరిపోయాడు.

శుక్రవారం వరకు ఈ సినిమాకు రూ. 198 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. శనివారం మార్నింగ్ షోతోనే మిగిలిన రెండుకోట్లు వచ్చేశాయి. దాంతో 200 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలోకి బజరంగీ భాయీజాన్ కూడా చేరిపోయింది.  

సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వం వహించిన హిందీ కిక్ సినిమా గత సంవత్సరం జూలై 25న విడుదలైంది. ఆ సినిమా మొత్తం రూ. 233 కోట్లు వసూలు చేసింది. బజరంగీ సినిమా ఆ మొత్తాన్ని సులభంగా దాటేస్తుందని అనలిస్టులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement