బాలయ్య అభిమానులకు మరో కానుక | Nandamuri Balakrishna, Boyapati Srinu's Roar Movie Animation Teaser Out Now - Sakshi
Sakshi News home page

బాలయ్య అభిమానులకు మరో కానుక

Published Tue, Jun 23 2020 3:21 PM | Last Updated on Tue, Jun 23 2020 5:31 PM

Balakrishna Boyapati BB3 First Roar Animation Teaser Out - Sakshi

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూడో చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక బాలయ్య బర్త్‌డే సందర్భంగా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు.ప్రస్తుతం బీబీ3 ఫస్ట్‌ రోర్‌ సోషల్‌ మీడియాలో తెగ రచ్చ చేస్తున్న విషయం తెలుస్తోంది. అయితే బాలయ్య అభిమానులకు మరో కానుకను చిత్రబృందం అందించింది. (బాలయ్యా మజాకా? అందులోనూ రికార్డులే!)

బీబీ 3 ఫస్ట్‌ రోర్‌కు సంబంధించి యానిమేటెడ్ టీజ‌ర్ విడుద‌ల చేసింది. ఎస్ఆర్ఏ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ వీడియో కూడా బాలయ్య అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలోనే చిత్ర టైటిల్‌ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. (బాలయ్య చిత్రంలో ‘బాల్‌రెడ్డి’?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement