ఫస్ట్ లుక్ | 'Batman v Superman': Aquaman's Role Revealed? | Sakshi
Sakshi News home page

ఫస్ట్ లుక్

Feb 23 2015 7:16 AM | Updated on Sep 2 2017 9:47 PM

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్

ఫస్ట్ ఇంప్రషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్... ఈ సూత్రాన్ని హండ్రెడ్ పర్సంట్ ఫాలో అవుతారు సినీ జనం.

ఫస్ట్ ఇంప్రషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్... ఈ సూత్రాన్ని హండ్రెడ్ పర్సంట్ ఫాలో అవుతారు సినీ జనం. హీరో ఎంట్రన్స్ అయినా... ఓ స్పెషల్ క్యారెక్టర్ పరిచయమైనా... తొలి షాట్‌ను మెమరబుల్‌గా తీసేందుకు ప్రయత్నిస్తారు. ఇక ‘ఫస్ట్ లుక్’ కోసం పడే ప్రయాస చెప్పనే అక్కర్లేదు. ఒకే ఒక్క పోస్టర్‌తో తమ ప్రొడక్ట్ మొత్తానికి ఓ సింబాలిక్‌గా... దానిపై ప్రజల్లో ఆసక్తి, అభిరుచి కలిగించి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా చేయడంలో కీలకం ఇదే! పొడవాటి కురులు... తిరిగిన కండలు... ఒంటి నిండా టాటూలు... చేతిలో విచిత్రమైన ఆయుధం...

గంభీరంగా ఉన్న ఈ చిత్రం డెరైక్టర్ జాక్ స్నిడర్ రూపొందిస్తున్న ‘బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్’లోనిది. ఇంతలా భయపెడుతున్న ఇతగాడు జాసన్ మొమో. ‘ఆక్వామ్యాన్’ క్యారెక్టర్‌లో ఇలా పరకాయ ప్రవేశం చేసిసినట్టుగా ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చిలో సినిమా రిలీజ్ అవుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ హిట్ సిరీస్‌లలో నటించిన మొమో... స్నిడర్ 2017, 2019ల్లో తీయబోయే జస్టిస్ లీగ్ ఫిల్మ్స్‌లోనూ లీడ్ రోల్‌లో కనిపిస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement