సాక్షి, హైదరాబాద్ : ‘భరత్ అనే నేను’ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. హీరో మహేశ్‌బాబు, హీరోయిన్ కియా అద్వానీ, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్ర నటీనటులు సక్సెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడారు.
కొరటాలకు రుణపడి ఉంటాను
ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు మాట్లాడుతూ.. దర్శకుడు కొరటాల శివకు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో శివ తనకు శ్రీమంతుడు లాంటిపెద్ద హిట్ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారని అన్నారు. సరైన సినిమాలు లేకపోవడంతో రెండేళ్లుగా ఒత్తిడిలో ఉన్నానని, భరత్ అనే నేను సినిమా హిట్‌తో చాలా ఆనందంగా ఉందని మహేశ్‌బాబు అన్నారు. సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం ఎక్స్‌ట్రార్డినరీ పాటలు ఇచ్చారని కొనియాడారు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు కాదు.. స్టోరీ టెల్లర్.. సినిమాకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారని తెలిపారు.
చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘‘భరత్ అనే నేను’ సినిమా చూసి చిరంజీవిగారు ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడారు. మా సిస్టర్స్ కూడా చూశారు. మంచి సినిమా చేశావు. సినిమా పెద్ద హిట్ అవుతుందని చిరంజీవిగారు అన్నారు’ అని చెప్పారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘మహేష్ లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా రాయాలి అనిపిస్తుంది. మహేష్ లేకపోతే ‘భరత్ అనే నేను’ సినిమా ఇంత పెద్ద హిట్ కాదు. మహేశ్‌తో సినిమా అంటే ఎప్పుడు స్పెషల్’ అని అన్నారు. ‘ దేవీశ్రీ ప్రసాద్ ఉంటే నాకు చాలా దైర్యం. నా నాలుగు సినిమాలకు నువ్వు ప్రాణం పోశావు. పోసానికి డైలాగ్స్ రాయాలంటే నాకు భయం వేసింది. ఆయన నాకు గురువు. ఆయనతో చేయడం ఇదే మొదటసారి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment