
భరత్ అనే నేనులో మహేశ్ బాబు
సాక్షి, సినిమా : ప్రిస్స్ మహేశ్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో అదరగొట్టాడు. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇతర సినీ తారలు కూడా చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. తాజాగా విజయోత్సవ వేడుకను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 27న తిరుపతి అలిపిరి రోడ్డులోని నెహ్రు మున్సిపల్ పాఠశాల మైదానంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు వేడుక ప్రారంభమవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment