
బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కే కాదు.. చూసే వీక్షకులకు కూడా ఇది పెద్ద షాకే. ఉన్నది ముగ్గురే నామినేషన్స్‌లో.. అయితే అందులోంచి ఇద్దర్నీ ఒకేసారి ఎలిమినేట్ చేయనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రోమో రిలీజ్ చేయలేదని బాధపడిన వారికి.. డబుల్ డోస్ ఇచ్చేశాడు.
అయితే ఈ ప్రోమోను చూస్తుంటే ఎలిమినేట్ అయింది రాహుల్, హిమజ అని తెలుస్తోంది. రాహుల్ వెళ్లడంతో పునర్నవి ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక నేను ఎవరిని తిట్టాలి.. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అని పున్ను తెగ బాధపడిపోతోంది. మహేష్ కెప్టెన్ అయిన కారణంగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment