
ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన బిగ్‌బాస్ షోకు రేపు శుభం కార్డు పడనుంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు వారి జీవితానికి సరిపడా అనుభూతులను మిగిల్చుకున్నారు, జీవితంలో అవసరమయ్యే మెళకువలను నేర్చుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు, షాక్‌లు ఇచ్చిన బిగ్‌బాస్ చివరగా అవార్డులను అందజేసి వాళ్లను సంతోషపెట్టనున్నాడు. అగ్ని గోళం, ఫుటేజ్ కింగ్, పక్కా మాస్.. ఇలాంటి ఎన్నో అవార్డులను నేడు బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు అందజేయనున్నాడు. దీనికోసం ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో పార్టీ మొదలుపెట్టేశారు. ఈ పార్టీలో జరిగే అవార్డుల కార్యక్రమానికి జాఫర్, బాబా భాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా వారి కామెడీతో పార్టీ అదిరిపోయేట్టు కనిపిస్తోంది.
ఈ పార్టీలో బిగ్‌బాస్ హౌస్ టాప్ లేచిపోయేలా ఇంటి సభ్యులు రచ్చ చేస్తున్నారు. గతంలో తన పాటతో మిగతా ఇంటి సభ్యులను గడగడలాడించిన హిమజ పార్టీలో మరోసారి గళాన్ని వినిపించనున్నట్లు కనిపిస్తోంది. దీంతో ‘మళ్లీనా’ అంటూ పునర్నవి పంచ్ వేసింది. ఇక ఆటపాటలు, సెటైర్లు, ఎంటర్‌టైన్‌మెంట్ వెరసి ఇంటి సభ్యుల జోష్ పీక్స్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో గడిపేందుకు ఇంటి సభ్యులకు నేడే ఆఖరి రోజు. దీంతో హౌస్‌మేట్స్ భావోద్వేగంతో బిగ్‌బాస్ బైబై చెప్తున్నారు. రేపటితో షో ముగుస్తుండటంతో బిగ్‌బాస్‌ను ఆరాధించే అభిమానులు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
Last day at #BiggBossTelugu3 house...Time to celebrate!!!
— STAR MAA (@StarMaa) November 2, 2019
Today at 9 PM on @StarMaa pic.twitter.com/jsglNYVwFZ
So many memories, so many emotions. All coming to an end. Last day in #BiggBossTelugu3 house
— STAR MAA (@StarMaa) November 2, 2019
Today at 9 PM on @StarMaa pic.twitter.com/0Faz0MPMEk
Comments
Please login to add a commentAdd a comment