ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి | Bigg Boss 3 Telugu Punarnavi Open Up About Her Relationship | Sakshi
Sakshi News home page

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

Published Sat, Sep 7 2019 10:47 PM | Last Updated on Sat, Sep 7 2019 10:55 PM

Bigg Boss 3 Telugu Punarnavi Open Up About Her Relationship - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ కాస్తా పోలీస్‌ స్టేషన్‌గా మారింది. బాబా భాస్కర్‌ ఎస్సైగా మారగా.. శివజ్యోతి రైటర్‌గా అవతారమెత్తింది. ఇక మిగిలిన హౌస్‌మేట్స్‌ తాము ఎవరిపై ఫిర్యాదు చేయదలిచారో వారి పేర్లను చెప్పమని తెలిపాడు. వాటిపై ఇంటి సభ్యులందరితో పాటు బాబా భాస్కర్‌ నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకుని దోషా? నిర్దోషా? అన్నది నాగ్‌ డిసైడ్‌ చేశాడు. ఈ వరుసలో వితికా.. వరుణ్‌పై ఫిర్యాదు చేసింది. టాస్క్‌లో భాగంగా తన వద్ద నుంచి గన్‌ లాక్కున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో వరుణ్‌ను నిర్దోషని ఇంటి సభ్యులు నిర్ణయించగా.. బాబా మాత్రం దోషి అని తన నిర్ణయం చెప్పాడు. 

పునర్నవి.. అలీపై ఫిర్యాదు చేయగా.. అతడ్ని ఏకాభిప్రాయంతో నిర్దోషి అని నిర్ణయించారు. రాహుల్‌ తనను అసభ్య పదజాలంతో దూషించడంతో దోషి అని మహేష్‌ పేర్కొన్నాడు. ఈ విషయంపై ఇంటిసభ్యులందరూ ఒకేతాటిపైకి వచ్చి రాహుల్‌ దోషి అని నిర్ణయించారు. శిల్పా.. అలీపై ఫిర్యాదు చేసింది. తన ప్రవర్తన సరిగా లేదని దోషి అంటూ తెలపగా.. ఈ విషయాన్ని అందరూ వ్యతిరేకించి.. అలీని నిర్దోషిగా ప్రకటించారు. హిమజ .. రవిపై చేసిన ఫిర్యాదును లెక్కలోకి తీసుకోలేదు. రవి.. వితికాపై, వరుణ్‌.. అలీపై, శ్రీముఖి.. రాహుల్‌పై ఫిర్యాదు చేశారు.

నాగ్‌.. తన తరుపున ఇంటి సభ్యులకు సంబంధించి కొన్ని ఫిర్యాదులున్నాయని తెలిపాడు. అన్ని విషయాలను కామెడీ చేస్తున్నాడని, సీరియస్‌గా తీసుకోవడం లేదని బాబాపై ఫిర్యాదు చేశాడు. కెప్టెన్‌గా కొత్త రూల్స్‌పెట్టడం, ఉన్న రూల్స్‌ను పట్టించుకోకపోవడంలాంటి విషయాలు ఎత్తి చూపాడు. పునర్నవికి సంబంధించి వ్యక్తిగత విషయాన్ని అడిగాడు. రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నా అని చెబుతున్నావని అడగ్గా.. అది పర్సనల్‌ అంటూ పునర్నవి దాటవేయసాగింది. అందరి ముందు చెప్పేశావుగా.. ఇప్పుడు మళ్లీ చెప్పు అని అడగ్గా.. దానికి గానూ పునర్నవి సిగ్గుపడుతు అవునని చెప్పుకొచ్చింది. అగ్రెసివ్‌ అయినవారి పేర్లు చెప్పడంలో రవి పేరు ఎందుకు చెప్పావ్‌ అంటూ శ్రీముఖిని ప్రశ్నించాడు. ఇక ఫైనల్‌గా రాహుల్‌ సేవ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. మిగిలిన వారిలోంచి అలీరెజా ఎలిమినేట్‌ అయినట్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి ఈ విషయం అధికారికంగా తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్‌ ప్రసారమయ్యేవరకు ఆగాల్సిందే. (బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement