కండక్టర్ వాలాకు చాయ్ వాలా బంపర్ ఆఫర్!
కండక్టర్ వాలాకు చాయ్ వాలా బంపర్ ఆఫర్!
Published Thu, Aug 21 2014 5:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
దశాబ్దకాలానికి పైగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి ఎన్నికల ముందు రజనీ రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే రూమర్లు కొంత కాలం షికారు చేసేవి. అయితే తాజాగా రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు తమిళ రాజకీయాలు ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అధికారం ఫుట్ బాల్ లో డీఎంకే కోర్టులోనో లేక అన్నాడీఎంకే కోర్టులో ఉంటూ వస్తోంది. అయితే ఈ రొటీన్ పాలిటిక్స్ నుంచి తమిళ ప్రజలకు బ్రేక్ ఇవ్వడానికి ప్రధాని నరేంద్రమోడీ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అధికార సమాజ్ వాదీ పార్టీ, ప్రతిపక్ష బీఎస్పీ పార్టీలకు దిమ్మతిరిగేలా చేసి బీజేపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనకు ఒకవేళ రజనీ ఓకే చెబితే సీఎం అభ్యర్థిగా ప్రకటించి జాక్ పాట్ కొట్టాలని ఆపార్టీ అడుగులేస్తోంది. గతంలో ఎన్నో పార్టీల నుంచి వచ్చిన రాజకీయ ప్రతిపాదనలను ఈ సినీ దళపతి సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం రజనీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. తొలి నుంచి రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడని ఈ సూపర్ స్టార్... మోడీ విజ్క్షప్తిని ఆమోదిస్తారా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. కాని సార్వత్రిక ఎన్నికల ముందు తన నివాసానికి వచ్చిన 'చాయ్ వాలా' ప్రధాని నరేంద్రమోడీని సాదరంగా ఆహ్వానించి.. ఈ కండక్టర్ వాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికి మోడీపై సానుకూల దృక్ఫథం రజనీ కలిగి ఉన్నాడనేది చూచాయగా కనిపిస్తోంది. అయితే చాయ్ వాలా ప్రధాని మోడీ.. ఓ కండక్టర్ వాలాను సీఎం పీఠం మీదకు ఎక్కించాలని చేస్తున్న పయత్నాలు ఫలిస్తాయా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.
Advertisement
Advertisement