ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా..! | Bollywood daddies Love their cute kids | Sakshi
Sakshi News home page

ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా..!

Published Sun, Apr 12 2015 10:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా..! - Sakshi

ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా..!

బాలీవుడ్ డాడీస్ తమ క్యూట్ కిడ్స్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. అన్నీ మరిచిపోయి వారి లోకంలో వీరు విహరిస్తున్నారు. కుమారుడు అబ్‌రామ్ చిలిపి చేష్టలను ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్‌తో కింగ్ ఖాన్ షారూఖ్ షేర్ చేసుకొంటున్నాడు. గతంలో అక్షయ్‌కుమార్, అర్జున్‌రాంపాల్‌లు కూడా తమ పిల్లల గుర్తులను వీపుపై, చేతులపై టాటూలతో పదిలపరుచుకున్నారు. ఇప్పుడు కుర్ర హీరో ఇమ్రాన్‌ఖాన్ వంతు. అతని పది నెలల ముద్దులొలికే కూతురు ఇమరా చిట్టి చిట్టి పాదాలను తన ఛాతిపై ముద్రించుకున్నాడట!

అదే... టాటూ వేయించుకున్నాడట! ఈ ఐడియా  తన తల్లిని చూసి తట్టినట్టుంది మనోడికి. ఆమె కూడా ఇమ్రాన్ చిన్ననాటి పాదాలను ఓ పేపర్‌పై వేయించి భద్రపరుచుకుందట! ‘నా తొలి సంతానం ఇమరా. ఈ తీపి జ్ఞాపకం ఎప్పటికీ నాకు గుర్తుండిపోవాలి. అందుకే ఈ పచ్చబొట్టు’ అంటూ ఓ ఆంగ్ల పత్రికతో చెప్పాడు ఇమ్రాన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement