బన్నీ సినిమా షురూ! | Boyapati Begins Shooting Film with Allu Arjun | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమా షురూ!

Jul 29 2015 10:35 PM | Updated on Sep 3 2017 6:24 AM

బన్నీ సినిమా షురూ!

బన్నీ సినిమా షురూ!

సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి’లో విరాజ్ ఆనంద్‌గా క్లాస్ లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు.

‘సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి’లో విరాజ్ ఆనంద్‌గా క్లాస్ లుక్‌లో  కనిపించిన  అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారాయన. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ కథానాయికలు. ఎస్.ఎస్. థమన్ స్వరాలందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమానులను అలరించేలా సినిమా ఉంటుంది. బోయపాటి శ్రీను శైలిలో సాగే శక్తిమంతమైన  కథాకథనాలు ఈ చిత్రానికి హైలైట్.  ఈ రోజు నుంచి ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరణ జరుగుతోంది’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement