నాన్‌స్టాప్‌గా బన్నీ | Allu arjun and Boyapati srinu movie starts from july 19th | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌గా బన్నీ

Published Mon, Jun 29 2015 10:55 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

నాన్‌స్టాప్‌గా బన్నీ - Sakshi

నాన్‌స్టాప్‌గా బన్నీ

 రేసు గుర్రం అంత దూకుడు అల్లు అర్జున్‌లో ఉంటుంది. ఎనర్జిటిక్ క్యారెక్టర్‌కి అవకాశం వస్తే, రెచ్చిపోతారు. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మంచి జోష్ ఉన్న పాత్రను చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పూర్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ డిఫరెంట్. హీరోని ఎంత మాస్‌గా చూపించాలో అంత మాస్‌గా చూపిస్తారు బోయపాటి. మాస్ పాత్రలు చేయడం అల్లు అర్జున్‌కి కొట్టిన పిండి అని చెప్పాలి. వచ్చే నెల 19న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement