కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల దేశ దేశాలే స్తంబించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. మరీ ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ’కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు.
(చదవండి : కరోనా కష్టాలు... టాలీవుడ్ హీరోల భారీ విరాళాలు)
ఇప్పటికే కరోనా క్రై సిస్ చారిటీకి కింగ్ నాగార్జున కోటీ రూపాయల విరాళం అందజేశారు. మహేశ్‌బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. (ఆల్రెడీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు), రామ్ చరణ్ రూ. 30 లక్షలు (ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.70 లక్షలను ప్రకటించారు), దగ్గుపాటి ఫ్యామిలీ రూ. కోటిని ప్రకటించారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సహాయంగా రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కరోనా క్రై సిస్ చారిటీస్‌కు అందిస్తున్నటు ప్రకటించారు. అలాగే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి సాయితేజ్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
(చదవండి : బుల్లితెర కార్మికులకు యాంకర్ ప్రదీప్ చేయూత)
Comments
Please login to add a commentAdd a comment