త్వరలో దాసరి బయోపిక్ | Dasari Narayana rao Biopic | Sakshi
Sakshi News home page

త్వరలో దాసరి బయోపిక్

Jul 6 2017 9:45 AM | Updated on Sep 5 2017 3:22 PM

త్వరలో దాసరి బయోపిక్

త్వరలో దాసరి బయోపిక్

ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం ఆదారంగా సినిమా తెరకెక్కించేందుకు

ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం ఆదారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నటుడు, ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కళ్యాణ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దాసరి శిష్యుల్లోని ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే తమ గురువుగారికి తానిస్తున్న ఘననివాళి అని ప్రకటించారు ఓ.కళ్యాణ్. ఈ సినిమాతో దాసరి సినీ రాజకీయ జీవితాన్ని ప్రస్థావించనున్నారు. ఆ సాధించిన విజయాలు, ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement