లాభాల్లో వాటా! | Deepika Padukone ask share in Finding Fanny Fernandes profit | Sakshi
Sakshi News home page

లాభాల్లో వాటా!

Published Fri, Feb 7 2014 3:20 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

లాభాల్లో వాటా! - Sakshi

లాభాల్లో వాటా!

సినిమాకు ఇంత పారితోషికం అని కాకుండా కొంతమంది స్టార్ హీరోలు లాభాల్లో వాటానో, ఓ ఏరియా ఇవ్వమనో అడుగుతుంటారు. ఇప్పటివరకూ ఏ కథానాయిక కూడా ఈ స్థాయిలో డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. ఆ ఘనతను దీపికా పదుకొనె దక్కించుకోబోతున్నారని సమాచారం. గత ఏడాది దీపికా పదుకొనె నటించిన చిత్రాలన్నీ భారీ విజయం  సాధించడంతో అమాంతం పారితోషికం పెంచేశారు. అయితే, ఓ ఇంగ్లిష్ సినిమాకి మాత్రం లాభాల్లో వాటా అడుగుతున్నారట దీపికా. ఆ చిత్రం పేరు ‘ఫైండింగ్ ఫానీ ఫెర్నాండెజ్’. 
 
దీపికా నటిస్తున్న తొలి ఇండియన్ ఇంగ్లిష్ సినిమా. ఈ చిత్రాన్ని దినేష్ విజన్‌తో కలిసి నటుడు సైఫ్ అలీఖాన్ రూపొందిస్తున్నారు. ‘ఇషక్‌జాదే’ ఫేం అర్జున్‌కపూర్, నసీరుద్దీన్ షా, పంకజ్‌కపూర్, డింపుల్ కపాడియా, దీపికా పదుకొనె ముఖ్య పాత్రధారులు. జూలైలో విడుదల కానున్న ఈ సినిమాకి వచ్చే లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్మాతలతో దీపికా ఒప్పందం కుదుర్చుకున్నారనే టాక్ ఉంది. ఇది నిజమేనా? అని దీపికాను ఓ జర్నలిస్ట్ అడిగితే -‘‘మీ జీతం ఎంతో నేనడిగానా? మరి.. నా సంపాదన గురించి మీకెందుకు?’’ అని ఘాటుగా స్పందించారట. ఒకవేళ వాటా తీసుకోకపోతే.. ‘లేదు’ అని సింపుల్‌గా చెప్పొచ్చు. కానీ, కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటో? ఈ ఉలికిపాటు దేనికో?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement