ధనుష్ చిత్రంలో హాలీవుడ్ నటుడు? | Dhanush Next Film Features Hollywood Actor Al Pacino ? | Sakshi
Sakshi News home page

ధనుష్ చిత్రంలో హాలీవుడ్ నటుడు?

Published Mon, Oct 24 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ధనుష్ చిత్రంలో హాలీవుడ్ నటుడు?

ధనుష్ చిత్రంలో హాలీవుడ్ నటుడు?

 యంగ్ స్టార్ ధనుష్ చిత్రంలో హాలీవుడ్ నటుడు నటించనున్నారన్నది తాజా సమాచారం. చూడడానికి సన్నగా, చిన్నగా క నిపించినా ధనుష్ కరెంట్ తీగ లాంటి నటుడు. ఆయనలో చాలా పవర్ ఉంది. ఇప్పటికే కోలీవుడ్ దాటి బాలీవుడ్‌కి ఎగబాకారు. త్వరలోనే హాలీవుడ్ అంతు చూడబోతున్నారు. అందుకు ముందుగా ఒక తమిళ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడితో నటించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన కొడి చిత్రం దీపావళికి తెరపైకి రానుంది.
 
  కాగా ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కి పాయుమ్ తోటా, వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న పవర్‌పాండి చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. అదే విధంగా తన మరదలు సౌందర్యరజనీకాంత్ దర్శకత్వంలో నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇంతగా బిజీగా ఉన్న ధనుష్ మరో చిత్రానికీ పచ్చజెండా ఊపారు. అదే యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న చిత్రం.
 
 ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. దీని విశేషం ఏమిటంటే చిత్రం షూటింగ్ అధిక భాగం అమెరికాలో నిర్వహించనున్నారట. ఇందులో ధనుష్‌తో హాలీవుడ్ ప్రముఖ నటుడు అల్ పాసినో నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అల్ పాసినో స్కర్‌ఫేస్ తదితర హాలీవుడ్ చిత్రాల ద్వారా ప్రాచుర్యం పొందారన్నది గమనార్హం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement