క్రిష్ 'రాయబారి' ఎవరు.? | director krish next movie title rayabhari | Sakshi
Sakshi News home page

క్రిష్ 'రాయబారి' ఎవరు.?

Published Tue, Dec 1 2015 1:09 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

క్రిష్ 'రాయబారి' ఎవరు.?

క్రిష్ 'రాయబారి' ఎవరు.?

హీరోయిజానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం కథా బలాన్నే నమ్ముకొని సినిమా తీస్తున్న దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). తొలి సినిమా నుంచే తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ కంచె సినిమాతో కమర్షియల్గా కూడా ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా కంచె మంచి కలెక్షన్లు సాధించటంతో పాటు దర్శకుడిగా క్రిష్ స్థాయిని కూడా మరో మెట్టు పైకి చేర్చింది.

ప్రస్తుతం అదే జోష్లో మరో సినిమాకు కథా కథనాలు రెడీ చేసే పనిలో ఉన్న క్రిష్, ఓ ఆసక్తికరమైన టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. అచ్చమైన తెలుగు టైటిళ్లతో ఆకట్టుకునే క్రిష్ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 'రాయబారి' అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. అయితే ఈ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరన్న విషయం పై మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు.

తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, చాలా కాలంగా క్రిష్తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. దీంతో క్రిష్ రాయబారి అఖిలే.. అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే క్రిష్ పండించే స్థాయి ఎమోషన్స్కు రెండో సినిమాతోనే అఖిల్ న్యాయం చేయగలడా..? అసలు అఖిల్ తదుపరి సినిమా క్రిష్ తోనే ఉంటుందా అన్న విషయం తెలియాలంటే మాత్రం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement