
ఉత్తమ విలన్‌కు ఈరోస్ భాగస్వామ్యం
ఉత్తమ విలన్ విడుదలకు ఈరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థ భాగస్వామ్యం అందిస్తోంది...
ఉత్తమ విలన్ విడుదలకు ఈరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థ భాగస్వామ్యం అందిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న ఈరోస్ ఇంటర్‌నేషనల్ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి చిత్ర నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించిన ఉత్తమ విలన్, రజనీమురుగన్ చిత్రాల విడుదలలో భాగస్వామ్యం పంచుకుంటోంది. కమలహాసన్ త్రిపాత్రాభినయం చేసిన ఉత్తమ విలన్ చిత్రానికి ఆయన స్నేహితుడు, నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. పూజాకుమార్, ఆండ్రియ నాయికలుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీన్ని ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తిరుపతి బ్రదర్స్ సంస్థ తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.