ప్రపంచాన్ని చుట్టేసే ఫకీర్‌ | The Extraordinary Journey of the Fakir teaser/poster | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని చుట్టేసే ఫకీర్‌

Feb 11 2018 12:29 AM | Updated on Feb 11 2018 12:29 AM

The Extraordinary Journey of the Fakir teaser/poster - Sakshi

ధనుష్‌

ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు ధనుష్‌. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న ధనుష్‌ ఇప్పుడు  హాలీవుడ్‌ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ‘వై దిస్‌ కొలవెరి డీ’ అంటూ ఇంతకు ముందు వరల్డ్‌ వైడ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసినా ఫుల్‌ టైమ్‌ యాక్టర్‌గా ఒక ఫ్రెంచ్‌  సినిమా ద్వారా డెబ్యూ చేయనున్నారు. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ అనే ఓ ఫ్రెంచి కామెడీ అడ్వెంచర్‌ సినిమాలో హీరోగా నటిస్తున్నారు ధనుష్‌. ఈ సినిమాలో ధనుష్‌ క్యారెక్టర్‌ టీజర్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. ‘ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌ హూ గాట్‌ ట్రాప్డ్‌ ఇన్‌ యాన్‌ అకియా వార్డ్‌రోబ్‌’ అనే నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు  కెన్‌ స్కాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ధనుష్, బెరెనిస్‌ బెజో, బార్ఖద్‌ అబ్ది ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమాను లుక్‌ బోసీ, ఆదితీ ఆనంద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు స్కాట్‌ మాట్లాడుతూ – ‘‘ముంబైలో పుట్టి తన పరిసర ప్రాంతాలు తప్ప మరో ప్రపంచం తెలియని ఓ కుర్రాడు ప్రపంచాన్ని ఎలా చుట్టాడు? అనేది కథాంశం. వివిధ ప్రాంతాల యాక్టర్స్‌తో పని చేయటం, వాళ్ల కల్చరల్‌ బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసుకోవటం చాలా ఇన్స్‌పిరేషనల్‌గా ఉంది. ధనుష్‌ అజాతశత్రూ లవాశ్‌ పటేల్‌ అనే ముంబై యువకుyì  పాత్ర పోషిస్తున్నారు. ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, లిబియా వంటి దేశాల్లో ఈ సినిమాను షూట్‌ చేశాం. ఫకీర్‌ ఫన్నీగా ఉంటూనే అడ్వెంచర్స్‌ చేస్తుంటాడు’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement