నటుడు విజయ్‌పై ఫిర్యాదు | Fish marketing Association Complaint on Hero Vijay | Sakshi
Sakshi News home page

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

Sep 24 2019 7:59 AM | Updated on Sep 24 2019 7:59 AM

Fish marketing Association Complaint on Hero Vijay - Sakshi

బిగిల్‌ చిత్రంపై వివాదం ఆరంభమైంది.

పెరతంబూరు: బిగిల్‌ చిత్రంపై వివాదం ఆరంభమైంది. నటుడు విజయ్‌ నటించే ప్రతి చిత్రానికి వివాదం తలెత్తడం మామూలైంది. పంచాయితీలు, కేసులు, కోర్టులు, ప్రభుత్వం వరరూ ఈ వివాదాలు వెళుతున్నాయి. తాజా చిత్రం  బిగిల్‌ను వదిలేలా లేదు. చిత్ర కథానాయకుడు  విజయ్‌పై మత్స్య వ్యాపారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కోవైకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు, ఉక్కడం నూతన మార్కెట్‌లో చెపల దుకాణదారుడు కోళికడై గోపాలం అలియాస్‌ పళనిస్వామి సహా ఐదుగురు సోమవారం కోవై కలెక్టర్‌ కార్యాలయంలో నటుడు విజయ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోని చేపల దుకాణదారులు, మాంసం వ్యాపారుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన నటుడు విజయ్‌కు తమిళ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.

మత్య్స, మాంస వ్యాపారులు తమ వృత్తిని ప్రారంభించే ముందు వారు ఉపయోగించే కత్తులకు నమస్కరిస్తారన్నారు. అలాంటి కత్తులపై నటుడు విజయ్‌ కాలు పెట్టి కూర్చున్న దృశ్యంతో కూడిన బిగిల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారన్నారు. ఇది మత్స్య, మాంసాల వ్యాపారుల మనోభావాలకు భంగం కలిగించే ఉందని పేర్కొన్నారు. ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించకుంటే దేశ వ్యాప్తంగా మత్స్య, మాంసం వ్యాపారుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నటుడు విజయ్‌కు, ఆ చిత్ర దర్శకుడు అట్లీకీ, చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎన్‌కు లాయర్‌ ద్వారా నోటీసులు పంపినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement