పవన్ కళ్యాణ్ పై మళ్లీ వేసేశాడు! | Gods should be replaced with PK, says Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ పై మళ్లీ వేసేశాడు!

Published Mon, Mar 20 2017 9:44 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్ పై మళ్లీ వేసేశాడు! - Sakshi

పవన్ కళ్యాణ్ పై మళ్లీ వేసేశాడు!

ప్రత్యక్ష విమర్శలు, పదుదైన వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడే విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన ప్రత్యేకత చాటుచుకున్నాడు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో ట్విటర్ లో కామెంట్ చేశాడు. 'నాకు మొక్కలంటే ప్రేమ..' అంటూ పవన్ కళ్యాణ్ పేరుతో వచ్చిన ట్విటర్ పోస్టుపై వర్మ స్పందించాడు. పవన్ కళ్యాణ్ దేవుడని నమ్ముతానని, దేవుళ్ల స్థానాన్ని అతడితో పూరించాలని వర్మ కామెంట్ పెట్టాడు.

'అతడు దేవుడని నేను ఎల్లప్పుడు నమ్ముతాను. బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్ల స్థానాలను 'పీకే'తో భర్తీ చేయాలని నిజంగా భావిస్తున్నా' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పై పలు సందర్భాల్లో ట్విటర్ వేదికగా వర్మ కామెంట్లు పెట్టారు. అయితే వర్మ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్‌ ఓ సందర్భంలో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement