వైక్కం బయోపిక్‌లో హనన్‌ | Hanan To Play Lead In Vaikom Vijayalakshmi Biopic | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 19 2018 6:30 AM | Last Updated on Sun, Aug 19 2018 6:30 AM

Hanan To Play Lead In Vaikom Vijayalakshmi Biopic - Sakshi

తమిళసినిమా: కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత మాదిరిగానే ఎవరైనా నటి, నటులు కావచ్చు. అదేవిధంగా సాయం చేయడానికి పేద, గొప్పతో పని లేదు. స్పందించే చిన్న హృదయం చాలు. ఏమిటీ ఏదేదో చెబుతున్నారనుకుంటున్నారా? పై మూడింటికి సంబంధం ఉంది. వైక్కం విజయలక్ష్మి వర్ధమాన గాయని. ఈమె మలయాళ చిత్రం సెల్యులాయిడ్‌ అనే చిత్రం ద్వారా గాయనిగా పరిచయమై ఆ తరువాత తమిళంలోనూ గాయనిగా రాణిస్తున్నారు.

ఇందులో విశేషం ఏముందని అనుకోవచ్చు. వైక్కం విజయలక్ష్మి ఒక అంధురాలు. ఆ కొరతను జయించి గాయనిగా పేరు తెచ్చుకుని చాలా మందికి స్ఫూర్తి గా నిలిచారు. ఇక మరో అంశానికి వస్తే ఇటీవల కేరళలో చేపల విక్రయ వ్యాపారం చేస్తూ కళాశాలలో చదువుకుంటున్న హనన్‌ అనే యువతి గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

సహ విద్యార్థులు సహా పలువురు హనన్‌ వృత్తిని అవహేళన చేసినా, వాటిని అసలు కేర్‌ చేయకుండా తాను చేపల వ్యాపారం చేస్తూనే చదువుకుంటాను అని దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఏకంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌నే ఆకర్షించింది. అంతే హనన్‌ ఆత్మవిశ్వాసాన్ని అభినందించిన ఆయన ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తానని మాట ఇచ్చారు.

అలాంటి సమయంలో కేరళ రాష్ట్రం వరద బారిన పడి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేరళ ముఖ్యమంత్రే వరద బాధితుల సహాయార్థం చేతనైన సాయం చేయాల్సిందిగా అర్ధిస్తుస్న పరిస్థితి. కాగా రోడ్డులో చేపలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ, మరో పక్క చదువుకుంటున్న హనన్‌ అందరిని ఆశ్చర్య పరుస్తూ రూ.1.5 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించింది.

సాయం చేయడానికి మంచి మనసు చాలు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా? ఇక మూడో విషయానికి వస్తే వైక్కం విజయలక్ష్మి బయోపిక్‌ చిత్రంగా తెరకెక్కినుంది. ఇందులో ఆమె పాత్రలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మత్స్యకారిణి, విద్యార్థిని హనన్‌ నటించబోతోంది. ఈమె ఇంతకు ముందే అవరై తేడి సెండ్రన్, అరై కల్లన్‌ ముక్కాల్‌ కల్లన్, మిఠాయ్‌ తెరివు అనే చిత్రాల్లో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement