ఈ ఫోటోను ఓ సారి మీరూ చూడండి
ముంబై : పాత ఫోటోలను మళ్లీ ఓసారి చూస్తూ ఉంటే మనసుకు భలే సంతోషంగా ఉంటుంది. ఆ పాత మధుర జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముడతాయి. నేను చూడు ఎలా ఉన్నానో... అరే...నువ్వు..ఈ ఆశ్చర్యాలు...ఆహాశ్చర్యాలు మామూలే..అంతేనా..
ఇలాంటి ఫోటోలు దొరికితే సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయింది.
బాలీవుడ్ హీరో, కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ తన ఫేస్ బుక్లో అలాంటి ఫోటో ఒకదాన్ని గురువారం షేర్ చేశారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కలిసి వున్న ఫోటో అది. దాదాపు కొన్ని దశాబ్దాల వెనకటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇపుడు ఫేస్బుక్లో చక్కర్లు కొడుతోంది. 27000 లైక్స్ తో, దాదాపు అయిదు వేల షేర్లతో హల్చల్ చేస్తోంది. దిలీప్ కుమార్, రాజ్ కుమార్, మనోజ్ కుమార్, ఫిరోజ్ కుమార్, షర్మిలా ఠాగూర్, సైరా భాను తదితర బాలీవుడ్ దిగ్గజాలు ఈ ఫోటోలో మనకు కనిపిస్తారు. వీరితో పాటు గాయని లతా మంగేష్కర్ కూడా ఉన్నారు.
ఇది ఏ సంవత్సరంలోదో కరెక్టుగా గుర్తులేదు కానీ, ఒక్క ఫోటోలో ఇంత మంది బాలీవుడ్ ప్రముఖులా... నాకైతే దీన్ని చూడగానే మతిపోయింది.. ఈ ఫోటోలో ఉన్న ఎవరినైనా మీరు గుర్తు పడతారా అంటూ రాజ్ బబ్బర్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.