కోలీవుడ్‌కు మరో కేరళా బ్యూటీ | I am a big fan of Rajinikanth says Iswarya Menon | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు మరో కేరళా బ్యూటీ

Published Fri, Dec 30 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

కోలీవుడ్‌కు మరో కేరళా బ్యూటీ

కోలీవుడ్‌కు మరో కేరళా బ్యూటీ

కోలీవుడ్‌కు మాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధమే ఉంది.ముఖ్యంగా కథానాయిక విషయంలో ఆ సంబంధాలు చాలా బలమైనవే అని చెప్పక తప్పదు.కోలీవుడ్‌లో నాయికలుగా ఏలుతున్న వారిలో అధిక శాతం మాలీవుడ్‌ భామలే. ఇక ఇక్కడ దర్శక నిర్మాతలు అక్కడి ముద్దుగుమ్మలపై దృష్టి సారిస్తున్నారా? లేక కేరళా కుట్టీలే కోలీవుడ్‌పై కన్నేస్తున్నారా? అన్నది పక్కన పెడితే వారి దిగుమతి మాత్రం ఇక్కడ అధికమే. నయనతార నుంచి అమలాపాల్‌ వరకూ చాలా మంది నాయికలు తమిళప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా మరో మాలీవుడ్‌ అమ్మడు కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ భామ పేరు ఐశ్వర్యామీనన్‌. ఆర్‌ఎస్‌.ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న వీరా అనే చిత్రం ద్వారా ఐశ్యర్యామీనన్‌ కోలీవుడ్‌కు అడుగు పెట్టనున్నారు.

దీని గురించి ఈ భామ తెలుపుతూ తన పూర్వీకం కేరళకు చెందినా తాను పెరిగింది, చదివింది చెన్నైలోనే నని చెప్పుకొచ్చింది. ఇంజినీరింగ్‌ చదివిన తనకు చిన్నతనం నుంచి నటన అంటే వల్లమాలిన ప్రేమ అని అంది.ఇక మలయాళం, కన్నడ భాషల్లో నటించినా తమిళంలో నటించాలన్నది తన పెద్ద కల అని పేర్కొంది. అది వీరా చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని అంది. అదీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్‌ఎస్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సంస్థ ద్వారా పరిచయం అవడం అదృష్టంగా భావస్తున్నానని చెప్పింది. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.వీరా టైటిల్‌తో ఇంతకు ముందు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం వచ్చిందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement