చక్రి అభిమానిని...:బాలయ్య | I am a fan of Chakri, says hero Balakrishna | Sakshi
Sakshi News home page

చక్రి అభిమానిని...:బాలయ్య

Published Mon, Dec 15 2014 12:59 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

చక్రి అభిమానిని...:బాలయ్య - Sakshi

చక్రి అభిమానిని...:బాలయ్య

హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి హఠన్మరణం నమ్మశక్యం కావటం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. గుండెపోటుతో మృతి చెందిన చక్రి భౌతికకాయన్ని ...బాలయ్య సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ చక్రి తన తమ్ముడు లాంటివాడని... అతను తన తమ్ముడులాంటివాడన్నారు.


ఇటీవలే హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమంలో తాము కలిశామని,... త్వరలో తన సినిమాకు మళ్లీ సంగీతం అందించాలని అడిగినట్లు  చెప్పారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని.. బాలకృష్ణ అన్నారు. చక్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా బాలకృష్ణ నటించిన 'సింహ' చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఆ సినిమాకు ఆయనకు నంది అవార్డు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement