సినీనటి ప్రణీత
పాత శ్రీకాకుళం : వస్త్ర ప్రపంచంలో నాణ్యతకు పేరుగాంచింది ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ అని ప్రముఖ సినీ నటి ప్రణీత అన్నారు. పట్టణంలోని జీటీ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌ను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖపట్నంలో ఎస్‌ఆర్ షాపింగ్ మాల్స్ నాలుగు ఉన్నాయని, ప్రస్తుతం శ్రీకాకుళం శాఖ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని చెప్పారు.
రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండగలకు మంచి ఆఫర్లు ఈ మాల్ ద్వారా లభిస్తాయన్నారు. అనంతరం షాపింగ్ మాల్‌లోని నాలుగు ఫ్లోర్లను ఆమె సందర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డెరైక్టర్ గోపీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి ప్రణీతతో ఫొటోలు దిగేందుకు షాపింగ్ మాల్ సిబ్బంది, తదితరులు క్యూ కట్టారు.
పవన్‌కల్యాణ్‌కు వీరాభిమానిని..
Published Fri, Oct 7 2016 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM
Advertisement
Advertisement