కింగ్ ఖాన్‌కు జోడీగా? | Ileana D'Cruz signed opposite Shah Rukh Khan for 'Fan'? | Sakshi
Sakshi News home page

కింగ్ ఖాన్‌కు జోడీగా?

Published Tue, Sep 9 2014 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

కింగ్ ఖాన్‌కు జోడీగా? - Sakshi

కింగ్ ఖాన్‌కు జోడీగా?

కరీనా కపూర్, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా, సోనాక్షీ సిన్హా... ఇలా బాలీవుడ్‌లో ఎంతోమంది తారలున్నప్పటికీ ఇలియానా బాగానే అవకాశాలు సంపాదించుకోగలుగుతున్నారు. రెండేళ్ల క్రితం ‘బర్ఫీ’ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయమయ్యారు ఈ బ్యూటీ. ఆ చిత్రంతో కలిపి ఇలియానా మరో రెండు చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ నవంబర్‌లో విడుదల కానుంది. తాజాగా, కింగ్ ఖాన్ షారుక్‌ఖాన్ సరసన ఈ గోవా బ్యూటీ నటించే అవకాశం దక్కించుకున్నారని సమాచారం.

ఈ చిత్రానికి ‘ఫ్యాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యశ్‌రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించనున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఇందు లో షారుక్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అవి కొత్తగా ఉంటాయని భోగట్టా. హాలీవుడ్ మేకప్ నిపుణుడు గ్రెగ్ కాన్నోమ్ ఈ గెటప్స్ గురించి వర్క్ చేస్తున్నారట. ఉత్తమ మేకప్ నిపుణుడిగా తొమ్మిదిసార్లు ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ పొంది, మూడు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఘనత గ్రెగ్‌ది. స్వయంగా ఆయన్ను పిలిపించడం ఈ చిత్రం భారీతనా నికి ఓ నిదర్శనం. ఒకవేళ ఈ చిత్రంలో కనుక ఇలియానా అవకాశం దక్కించుకుని ఉంటే... కచ్చితంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement