
అలా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది
‘‘చాలా మంది నిర్మాతలు, దర్శకులు తమ బిడ్డలను హీరోలను చేయడంతో పాటు, వాళ్లని అగ్రస్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. కానీ, నా బిడ్డలకు అదృష్టం లేదని బాధపడేవాణ్ణి. అయితే, ఇండస్ట్రీలో ఉన్నది డెబ్భై శాతం మంది నా బిడ్డలే అని చెప్పుకోవడం గర్వంగా ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు.
బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ చిత్రం లోగోను దాసరి ఆవిష్కరించారు. ‘‘మురళీ రామ్మోహనరావు రాసిన ‘ఎలుక వచ్చె ఇల్లు భద్రం’ నవల ఆధారంగా ఈ చిత్రం తీశాను. గ్రాఫిక్స్ ఓ హైలైట్’’ అని దర్శకుడు చెప్పారు.