అలాంటి వ్యక్తి తారసపడితే ప్రేమిస్తా! | Kajal Aggarwal special interview | Sakshi
Sakshi News home page

అలాంటి వ్యక్తి తారసపడితే ప్రేమిస్తా!

Aug 11 2016 2:52 AM | Updated on Aug 20 2018 7:19 PM

అలాంటి వ్యక్తి తారసపడితే ప్రేమిస్తా! - Sakshi

అలాంటి వ్యక్తి తారసపడితే ప్రేమిస్తా!

ప్రేమ విలువ తెలియనివారు ప్రేమిస్తున్నారని, అలాంటి వారిని చూస్తే జాలేస్తోందంటున్నారు నటి కాజల్‌అగర్వాల్.

ప్రేమ విలువ తెలియనివారు ప్రేమిస్తున్నారని, అలాంటి వారిని చూస్తే జాలేస్తోందంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ మంచి జోష్‌లో ఉన్నారు. కారణం అవకాశాలు వరుస కట్టడమే. కవలైవేండామ్ చిత్రంలో జీవాతో రొమాన్స్ చేస్తున్న కాజల్ త్వరలో అజిత్‌తోయువళగీతాలు పాడడానికి సిద్ధం అవుతున్నారు. అవును ఏకే 57 చిత్రంలో ఈ బ్యూటీనే నాయకి. ఈ చిత్రం కోసం అబ్రాడ్‌కు ఎగరనున్న కాజల్‌అగర్వాల్‌తో ప్రేమ,పెళ్లి అంశాల గురించి చిన్న చిట్‌చాట్.
 
 ప్ర: ప్రేమ గురించి మీ అభిప్రాయం?
 జ: ప్రేమ విషయంలో ఈ తరం యువతను చూస్తే జాలేస్తోంది. ఎవరికి వారు తమ స్వార్థం కోసం ప్రేమిస్తున్నారు.అలాంటి ప్రేమ చిరకాలం ఉండడం లేదు. నిజమైన ప్రేమ అపూర్వమైనది. ప్రేమలో స్వచ్ఛత ఉండాలి. అది తీయని అనుభూతిని కలిగించాలి. ఇప్పటి తరం ప్రేమను చూస్తే జాలేస్తోంది.
 
 ప్ర: ఎందుకు అలా భావిస్తున్నారు?
 జ: కళ్ల ముందు జరిగేవి చూస్తున్నాంగా. ఒకరినొకరు మనసారా ప్రేమించుకుంటున్నామంటున్నారు. కొంత కాలానికే మనస్పర్థలతో విడిపోతున్నారు. విడాకులంటున్నారు. నిజానికి లోపం ఎక్కడో ఆలోచించుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు ప్రేమ విలువ తెలియని వారు ప్రేమిస్తున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. నేను ప్రేమిస్తే అందులో నిజాయితీ ఉంటుంది.
 
 ప్ర: ఎవరినైనా ప్రేమిస్తున్నారా?
 జ: ఈ ప్రశ్న నన్ను కలిసిన చాలా మంది అడుగుతుంటారు. పెళ్లెప్పుడు అని కూడా ప్రశ్నిస్తుంటారు. పెళ్లి చేసుకోవాలన్న ఆశ నాకూ ఉంది. అయితే మనసుకు నచ్చిన వాడు ఇంకా ఎదురు పడలేదు. అలాంటి వ్యక్తి తారసపడినప్పుడు తప్పకుండా ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను. తన కోసం అధిక సమయాన్ని కేటాయిస్తాను.
 
 ప్ర: నటిగా అగ్రస్థానంలో కొనసాగడం గురించి?
 జ: సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు.అందుకే అపజయాలు నన్ను బాధించవు. స్టార్ ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తున్నాను. నాకు సినిమా నాలెడ్జ్ ఉంది. అది అపజయాలప్పుడు నన్ను నిలబెడుతుంది. కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement