ముంబై: భారతీయ చలన చిత్రదర్శకురాలు , రచయిత కల్పనా లాజ్మి (61) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ‍్యంతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి ఆందోళకరంగా మారడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూత్రపిండాల క్యాన్సర్‌తో బాధపడుతున్న కల్పనాను సోమవారం ముంబైలోని కోకిలబెన్ ఆసుపత్రికి తరలించినట్టు ఆమె తల్లి వెల్లడించారు.
మహిళా ఆధారిత చలన చిత్రాలతో చిత్రాలతో పాపులర్ అయ్యారు కల్పన . ముఖ్యంగా దామన్-ఎ విక్టిమ్ ఆఫ్ మారిటల్ వయోలెన్స్ , రుడాలి మూవీలకు జాతీయ అవార్డులను కూడా గెల్చుకున్నారుమరోవైపు ఆమె వైద్య ఖర్చులపై బాలీవుడ్ నటుటు అమీర్‌కాన్, రోహిత్ షెట్టి, ఇండియన్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ శ్రద్ధ తీసుకుంటోంది. అలాగే అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నాయకులుకూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
కాగా ప్రముఖ చిత్రకారుడు లలితా లాజ్మి కుమార్తె కల్పన చిత్రనిర్మాత, బాలీవుడ్ నటుడు గురుదత్ కు మేనకోడలు కూడా. ప్రముఖ చిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ ద్వారా సహాయక దర్శకుడిగా పరిచయమైన ఆమె 1986 లో ఆమె దర్శకురాలిగా తొలి చిత్రం షబ్బనా అజ్మీ , నసీరుద్దిన్ షా కలిసి నటించిన ఏక్ పల్.
Comments
Please login to add a commentAdd a comment