అదృష్టం అంటే ఆమెదే
అదృష్టం ఉంటే అనామకులు కూడా అందలమెక్కుతారంటారు. ప్రస్తుతం తారల విషయానికొస్తే అభినయాని కంటే అదృష్టాన్ని నమ్ముకున్నవారే అధికం. నిజానికి నటనా ప్రతిభ ఉన్నా దాన్ని చాటుకునే అవకాశం రావాలన్నా మళ్లీ అదృష్టమే అవసరం అవుతుంది. అలాంటి అదృష్టం వరిం చిన హీరోయిన్లలో ఆండ్రియూ ఒకరని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ లైఫ్‌స్టైల్ ఇతర హీరోయిన్లకు భిన్నమని చెప్పవచ్చు. తన జీవితం తన ఇష్టం అన్నట్లు ప్రవర్తించే ఆండ్రియూ చాలాసార్లు వదంతులకు కేంద్ర బిందువుగా మారారు. అయినా తన నటనా కెరీర్‌కు ఎలాంటి భంగం కలగకపోవడం విశేషమే. అలాగే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం హీరోయిన్లకు ఒకసారి లభించడమే కష్టతరం. అలాంటిది ఆండ్రియాకు విశ్వనాయకుడు కమల్ సరసన వరుసగా మూడుసార్లు జతకట్టే అవకాశం లభించడం నిజంగా లక్కేనంటున్నాయి సినీ వర్గాలు.
విశ్వరూపం, విశ్వరూపం-2 చిత్రాల్లో కమల్‌తో రొమాన్స్ చేసిన ఆండ్రియూ తాజాగా ఉత్తమ విలన్ చిత్రంలో ఆయనకు జంటగా నటిస్తున్నారు. ఈ అదృష్టానికి ఆండ్రియానే ఆశ్చర్యపోతున్నారు. నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో కమలహాసన్ నటన చూసి అబ్బురపడేదాన్నని అలాంటి తనకు విశ్వరూపం చిత్రంలో నటించే అవకాశం కల్పించినప్పుడు ఇది కలా? నిజమా? అని కొన్ని నిమిషాలు నమ్మశక్యం కాని పరిస్థితికి లోనయ్యానన్నారు ఆండ్రియూ. కమలహాసన్‌తో నటించడం నిజంగా తన అదృష్టమే. ‘‘ఇప్పుడు నటనలో చాలా ఆరితేరాను, కమల్ లాంటి నటుడితో వరుసగా నటించే అవకాశాలు ఎంతమందికి వస్తా రుు చెప్పండి’’ అంటూ తన అదృష్టానికి పొంగిపోతున్నారు ఆండ్రియూ.