
ఒకే రాత్రిలో...
కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’ మే 1న విడుదల కానుంది. ఇంకా ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’
కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’ మే 1న విడుదల కానుంది. ఇంకా ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’కి తమిళ రీమేక్) చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి చేయనున్న చిత్రంపై కమల్ దృష్టి సారించారు. ఒకే రాత్రి జరిగే కథతో ఈ చిత్రం రూపొందనుందనీ, దీనికి ‘ఒరే ఇరవు’ (అంటే ‘ఒకే రాత్రి’ అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. కమల్ నటించిన పలు చిత్రాలకు సహాయ దర్శకునిగా చేసిన రాజేశ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందనీ, ఇందులో త్రిషను కథానాయికగా ఎంపిక చేశారనీ భోగట్టా.