ఎంతో వేదన అనుభవించా
‘సినీ రాజకీయాలు నాకు తెలియనందుకే వేదనకు గురయ్యా’ అని చెప్పారు నటుడు కమలహాసన్. నటుడు జయరాం కొడుకు కాళిదాస్ ఒరు పక్క కథై అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. నడువుల కొంచెం పక్కత్త కానోం చిత్రం ఫేమ్ బాలాజీ ధరణిధరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం ఇటీవల జరిగింది. కాళిదాస్‌ను నటుడు కమలహాసన్ పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంచెం పేరు రాగానే ఇతరులను మరచిపోతున్న కాలమిదన్నారు. అయితే నటుడు జయరాం అలా కాదన్నారు. ఆయన మాదిరిగానే ఆయన కొడుకు నడుచుకోవాలని హితవు పలికారు. సినిమాలో తనకెవరూ శత్రువులు లేరన్నారు. అయినా ఒక కుటుంబంలో వియ్యంకుల్లాగా గొడవలు పడుతూ విడిపోతున్నారని భావిస్తానన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి తాను నటిస్తున్నానన్నారు. తనకు వారసత్వంపై నమ్మకం లేదన్నారు.
శమనే నమ్ముతానని చెప్పారు. వారసులయినంత మాత్రాన జయించలేరన్నారు. తనను వ్యత్యాసమైన వ్యక్తి అంటుంటారని, తాను బాలచందర్ స్కూలులో చదువుకున్నవాడినని ఆయన మాదిరిగానే భిన్నంగా ఉంటానని పేర్కొన్నారు. అందుకే నటించడానికి వచ్చానన్నారు. నటుడు జయరాంకు రాజకీయాలు తెలియవు. తనకు మాత్రం చిత్ర పరిశ్రమలో ఎంతగా రాజకీయాలు చేస్తారో బాగా తెలుసన్నారు. అలాంటి రాజకీయాలతో తాను వేదన అనుభించానని కమలహాసన్ అన్నారు.