టీనేజ్ కుర్రాడితో రొమాన్స్! | Kangana ranaut romances with teenage Boy! | Sakshi
Sakshi News home page

టీనేజ్ కుర్రాడితో రొమాన్స్!

Oct 3 2013 1:21 AM | Updated on Apr 3 2019 6:23 PM

టీనేజ్ కుర్రాడితో రొమాన్స్! - Sakshi

టీనేజ్ కుర్రాడితో రొమాన్స్!

ఓ ముస్లిమ్ యువతి, బ్రాహ్మణ కుర్రాడి మధ్య సాగే ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘రాజ్జో’. ఈ కథలో కొత్తదనం ఏముంది? ఇలాంటివి చాలా సినిమాల్లో చూశాంగా అనుకుంటున్నారా? కానీ ఈ కథలో ఓ ట్విస్ట్ ఉంది. ఆ కుర్రాడిది టీనేజ్.

ఓ ముస్లిమ్ యువతి, బ్రాహ్మణ కుర్రాడి మధ్య సాగే ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘రాజ్జో’. ఈ  కథలో కొత్తదనం ఏముంది? ఇలాంటివి చాలా సినిమాల్లో చూశాంగా అనుకుంటున్నారా? కానీ ఈ కథలో ఓ ట్విస్ట్ ఉంది. ఆ కుర్రాడిది టీనేజ్. ఆ అమ్మాయి వయసు దాదాపు పాతికేళ్లు. ఈ ఇద్దరి మధ్య సాగే ప్రేమకథకు ఎలాంటి ముగింపునిచ్చారో ‘రాజ్జో’లో చూడాల్సిందే. 
 
 ముస్లిమ్ యువతిగా కంగనా రనౌత్, బ్రాహ్మణ కుర్రాడిగా పారస్ అరోరా నటించారు. నూతన దర్శకుడు విశ్వాస్ పాటిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ప్రేమకథ కాబట్టి హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ చాలానే ఉంటాయట. ఇప్పటివరకు దర్శకుడు చెప్పిన సన్నివేశాలన్నిటినీ చేసిన కంగనా ఇటీవల మాత్రం ఓ సీన్‌కి ‘నా వల్ల కాదు’ అనేశారు. ఎందుకంటే ఆ సీన్ చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. పారాస్ వయసు 17. ఈ మైనర్ బాలుడితో ఈ స్థాయిలో విజృంభించడం సరికాదని భావించే సదరు సన్నివేశానికి కంగనా ససేమిరా అన్నారు. 
 
 ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించినప్పట్నుంచీ పారాస్ చాలా ముభావంగా, బిడియంగా ఉండటంతో, అతని భయాన్ని, బెరుకుని పోగొట్టడానికి కంగనా చాలా ఫ్రెండ్లీగా మెలిగేవారు. రొమాంటిక్ సీన్స్‌లో కూడా తనే ప్రోత్సహించి చేయించేవారట. కానీ, దానికీ ఓ హద్దు ఉందని భావించారామె. దిసీజ్ టూమచ్ అని, అలాంటి సీన్ చెయ్యనని మొండికేశారట. దాంతో చేసేదేం లేక ఆ సన్నివేశాన్ని మార్చి రాశారని సమాచారం. నవంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement