
కన్నుల్లో నీ రూపమే!
‘కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున, టబు రొమాంటిక్‌గా పాడుకున్న పాట గుర్తుండే
‘కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున, టబు రొమాంటిక్‌గా పాడుకున్న పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ పాట పల్లవి ‘కన్నుల్లో నీ రూపమే’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందు, తేజస్వి ప్రకాశ్ జంటగా బిక్స్ దర్శకత్వంలో ఇ. రాజమౌళి సమర్పణలో భాస్కర్ భాసాని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ‘‘మా బ్యానర్‌లో తొలి చిత్రమిది. సాకేత్ మంచి సంగీతం అందించారు.
ఏప్రిల్‌లో సినిమా విడుదల చేయాలనేది ప్లాన్’’ అన్నారు నిర్మాత భాస్కర్. ‘‘మంచి ప్రేమకథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. సాకేత్, నందు రెండు కళ్లలా సపోర్ట్ చేశారు’’ అన్నారు బిక్స్. నిర్మాత ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, సాయికార్తీక్ తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.