పెళ్లి కాకుండానే తండ్రైన కరణ్ | karan johar becomes father twins | Sakshi
Sakshi News home page

పెళ్లి కాకుండానే తండ్రైన కరణ్

Mar 5 2017 10:35 AM | Updated on Apr 4 2019 4:44 PM

పెళ్లి కాకుండానే తండ్రైన కరణ్ - Sakshi

పెళ్లి కాకుండానే తండ్రైన కరణ్

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తండ్రి అయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను కూడా బహిరంగంగా మాట్లాడే కరణ్ ఫిబ్రవరిలోనే

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తండ్రి అయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను కూడా బహిరంగంగా మాట్లాడే కరణ్  ఫిబ్రవరిలోనే  కవల పిల్లలకు తండ్రి అయిన ఇన్నాళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టాడు. సరోగసి విధానం ద్వారా ఓ బాబు, ఓ పాపకి ఆయన జన్మనిచ్చాడు.  ముంబై అంధేరిలోని మస్రానీ హాస్పిటల్ లో ఇద్దరు పిల్లలు జన్మించగా ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా కరణ్ పేరుని బర్త్ సర్టిఫికెట్ లో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆది వారం కరణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.

అయితే కరణ్ అవివాహితుడు కావటంతో తల్లి పేరును మాత్రం తెలపలేదు. శుక్రవారం (మార్చి 3) రోజు ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఇద్దరు పిల్లల పేర్లను రిజిస్టర్ చేయించాడు. కరణ్ తన ఆటోబయోగ్రఫీలో పిల్లలను దత్తత తీసుకుంటాను లేదంటే సరోగసి ద్వారా పిల్లలకు తండ్రిని అవుతాను అని చెప్పాడు. తాజాగా ఆ మాటలను నిజం చేస్తూ కరణ్ తండ్రి అయ్యాడన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కూడా ఇటీవల ఇదే బాటలో సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement