
కర్ణాటక,యశవంతపుర : నడుస్తున్న కారులో సెల్ఫీ తీసుకున్న కేసుకు సంబంధించి శాండిల్‌వుడ్ నటి సంజనకు పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే తనకు కొంత వ్యవధి కావాలని ఆమె పోలీసులను కోరారు. తను షూటింగ్ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నానని, వచ్చిన తరువాత హాజరవుతానని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంజనా కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అవి వైరల్‌గా మారండంతో సీరియస్‌గా పరిగణించిన పోలీసులు వివరణ ఇవ్వాలని సంజనకు నోటీసులు పంపారు. ఆమె సెల్ఫీపై నెటిజన్లు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment