విషయం ఉంటే విజయం! | Karthi's film fails to beat opening weekend record of Oopiri | Sakshi
Sakshi News home page

విషయం ఉంటే విజయం!

Published Mon, Oct 31 2016 11:46 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

విషయం ఉంటే విజయం! - Sakshi

విషయం ఉంటే విజయం!

‘‘దీపావళికి విడుదలైన మా ‘కాష్మోరా’ చిత్రం ఘనవిజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రం చూసి ఎంజాయ్ చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. కార్తీ, నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం ‘కాష్మోరా’. పీవీపీ మాట్లాడుతూ -‘‘సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు.

ఈ సినిమాలో అది ఉంది కాబట్టే విజయం సాధించింది. ఈ విజయం వెనక కార్తీ, గోకుల్, చిత్రబృందం అందరి కృషి ఉంది. ‘కాష్మోరా’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రానా హీరోగా తెరకెక్కించిన ‘ఘాజీ’ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నాం. ‘ఊపిరి’ తర్వాత నాగార్జునతో ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’ చిత్రం నిర్మించబోతున్నా. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబుతో ఓ చిత్రం నిర్మిస్తా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement