
సూర్య. విక్రమ్... ఇలా పెద్ద హీరోల చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఏ నాయిక అయినా ఓకే అంటారు. పైగా బోలెడంత పేరు తెచ్చుకున్న కథానాయిక అయితే అంతే పేరున్న హీరో సరసన మాత్రమే నటించాలని అనుకుంటారు. ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేశ్ కాస్త డిఫరెంట్. కథ బాగుంటే చాలు.. హీరో ఎవరన్నది ఆమెకు ముఖ్యం కాదు. అందుకే స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తున్నప్పటికీ కథ నచ్చి, శశికుమార్ సరసన నటించడానికి అంగీకరించారు. ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
ఇంతకుముందు శశికుమార్, ప్రభాకరన్ కాంబినేషన్‌లో ‘సుందరపాండియన్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. సబ్జెక్ట్ సెలెక్షన్ విషయంలో శశికుమార్‌కి మంచి అవగాహన ఉంది. కీర్తీ కూడా బెస్ట్. సో.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా సూపర్ హిట్ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఇక కీర్తీసురేశ్ సినిమాల రిలీజ్‌ల విషయానికి వస్తే... విక్రమ్ సరసన ఆమె నటించిన ‘సామీ స్క్యేర్’ ఈ నెల 21న రిలీజ్ కానుంది. అలాగే విశాల్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన ‘పందెంకోడి 2’ చిత్రం ఈ దసరాకు విడుదల కానున్న సంగతి తెలిసిందే.