ప్ర‌భాస్‌ సినిమా కోసం వెయిటింగ్‌: కీర్తి | Keerthy Suresh Cant Wait Blockbuster Combo Prabhas, Deepika Padukone | Sakshi
Sakshi News home page

ప్ర‌భాస్ 21 బ‌్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా:‌ మ‌హాన‌టి

Published Mon, Jul 20 2020 3:06 PM | Last Updated on Mon, Jul 20 2020 4:34 PM

Keerthy Suresh Cant Wait Blockbuster Combo Prabhas, Deepika Padukone - Sakshi

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 21వ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించేందుకు బాలీవుడ్ స్టార్ దీపిక ప‌దుకొనేను ఎంపిక చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం కావ‌డం విశేషం. ఒకే సినిమాలో ఇద్ద‌రు స్టార్‌లు క‌లిసి న‌టిస్తుండ‌టంతో డార్లింగ్‌ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. "థ్రిల్లింగ్ మించి ఫీల్ అవుతున్నా.. అద్భుత‌మైన జర్నీని మొద‌లుపెట్టేందుకు ఆగ‌లేకున్నా" అని దీపిక సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. తాజాగా హీరోయిన్‌ కీర్తి సురేశ్ ఈ సినిమా గురించి స్పందించారు. ప్ర‌భాస్‌, దీపిక క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌ని జోస్యం చెప్పారు. (రాజుకు తగ్గ రాణి)

"ఈ జంట న‌మోదు చేయ‌నున్న‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం కోసం ఎదురు చూస్తున్నాను" అని కీర్తి సురేశ్ రాసుకొచ్చారు. మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్ర‌భాస్ చిత్రాన్ని పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. కోవిడ్ తీవ్ర‌త త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమా ప్రీ పొడ‌క్షన్ ప‌నులు మొద‌లు పెట్ట‌నున్నారు. కాగా కీర్తి సురేశ్ క్రీడా నేప‌థ్యంలో సాగే "గుడ్‌ల‌క్ స‌ఖి" చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌రోవైపు ఆమె న‌టించిన మిస్ ఇండియా చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. (‘ ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement