లాయర్ సంజీవ్ చతుర్వేదిగా రాజేంద్రుడు | lawyer Sanjeev Chaturvedi as Rajendra Prasad | Sakshi
Sakshi News home page

లాయర్ సంజీవ్ చతుర్వేదిగా రాజేంద్రుడు

Published Mon, Aug 5 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

లాయర్ సంజీవ్ చతుర్వేదిగా రాజేంద్రుడు

లాయర్ సంజీవ్ చతుర్వేదిగా రాజేంద్రుడు

ఏ పాత్ర చేస్తే అందులోకి పరకాయ ప్రవేశం చేసే నేర్పు డా. రాజేంద్రప్రసాద్‌కి ఉంది. ఇప్పటివరకు ఎన్నో పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన ‘వసుంధర నిలయం’లో లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. ట్రెండ్‌సెట్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి రవిశన్ దర్శకుడు. 
 
 రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పగడాల నరేంద్రకుమార్ మాట్లాడుతూ - ‘‘రాజేంద్రప్రసాద్ చేసిన లాయర్ సంజీవ్ చతుర్వేది పాత్ర సినిమాకి ఎస్సెట్‌గా నిలుస్తుంది.
 
  సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో సాగే యువతరం చిత్రం ఇది. విజయ్ కురాకుల మంచి పాటలిచ్చారు. అన్ని పాటలూ సందర్భానుసారంగా సాగుతాయి’’ అని చెప్పారు. సాహితి, సత్య, జయవాణి, కృష్ణేశ్వరరావు, సాండి, అపర్ణవర్మ, రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జీవీ ప్రసాద్, కథ-మాటలు: ముని సురేష్ పిళ్లై.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement