‘లవ్ జంక్షన్’ పాటలు
‘లవ్ జంక్షన్’ పాటలు
Published Mon, Aug 19 2013 1:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
‘‘నేటి తరం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. కొత్త రకం సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాను. ఇలాంటి చిత్రాలు వస్తే పరిశ్రమ బాగుంటుంది. ఈ చిత్రం పాటలు బాగున్నాయి. ఈ పాటలు, సినిమా ప్రేక్షకాదరణ పొందుతాయనే నమ్మకం ఉంది’’ అన్నారు డా. రాజేంద్రప్రసాద్.
సుమిత్‌రాయ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ జంక్షన్’. టి. భరత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి కాదంబరి కిరణ్, ఎస్. బాలాజీకుమార్ సహనిర్మాతలు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న బి.గోపాల్ సీడీని ఆవిష్కరించి రాజేంద్రప్రసాద్, వరుణ్ సందేశ్‌లకు అందజేశారు.
ఈ టైటిల్ బాగుందని, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని బి.గోపాల్ అన్నారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇది యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు అన్నారు. చిత్రనిర్మాణంలో సహకరించిన రామసత్యనారాయణకు కాదంబరి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Advertisement