వాక్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇద్దాం: ఆమిర్ ఖాన్ | let us support free speech, says aamir khan | Sakshi
Sakshi News home page

వాక్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇద్దాం: ఆమిర్ ఖాన్

Published Thu, Jun 16 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

వాక్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇద్దాం: ఆమిర్ ఖాన్

వాక్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇద్దాం: ఆమిర్ ఖాన్

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ వాక్ స్వాతంత్ర్యంపై మాట్లాడాడు. ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు ముందే టోరెంట్ సైట్లలో లీక్ కావడంపై పరోక్షంగా మండిపడ్డాడు. ఆ సినిమాను కేవలం థియేటర్లలోనే చూడాలని పిలుపునిచ్చాడు. పైరేట్లు, పైరసీ విజయం సాధించకుండా మనమంతా చూడాలని చెప్పాడు.

ఉడ్తా పంజాబ్ సినిమాకు సీబీఎఫ్‌సీ భారీమొత్తంలో కట్‌లు పెట్టగా, బాంబే హైకోర్టు దానికి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, విడుదలకు ముందుగానే ఆ సినిమా టోరెంట్ సైట్లలో లీకైపోయింది. సెన్సార్ కోసం ఇచ్చిన సినిమా ప్రింటే ఆన్‌లైన్‌లో లీకైందని అంటున్నారు. దానిమీద 'ఫర్ సెన్సార్' అనే స్టాంపు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమిర్ స్పందించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement