
మా అమ్మ సీతామాలక్ష్మీ అంటున్న వరుణ్
పూరి తన నెక్ట్స్ సినిమా టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాడట. గురువు రామ్గోపాల్వర్మ సూచన మేరకు వరుణ్తో చేస్తున్న సినిమాకు సాఫ్ట్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నాడట. ఇన్నాళ్లు సినిమా కోసం లోఫర్ అనే టైటిల్ను...
పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడట. గురువు రామ్గోపాల్వర్మ సూచన మేరకు వరుణ్తో చేస్తున్న సినిమాకు సాఫ్ట్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నాడట. ఇన్నాళ్లు ఆ సినిమా కోసం 'లోఫర్' అనే టైటిల్ను పరిశీలించినా, ఇప్పుడు ఆ టైటిల్ మార్చాలని ఫిక్స్ అయ్యాడట.
ప్రస్తుతం 'కంచె' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. తొలి సినిమా 'ముకుంద'తో పాటు కంచె కూడా తనకు మాస్ ఇమేజ్ తీసుకురాదని తెలిసిన వరుణ్, పూరితో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు తొలుత 'లోఫర్' అన్న టైటిల్ నిర్ణయించినా, ప్రస్తుతానికి 'మా అమ్మ సీతామాలక్ష్మీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. గతంలో 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' పేరుతో అమ్మ సెంటిమెంట్ పండించిన పూరి, మరోసారి అదే ఫార్ములను రిపీట్ చేస్తున్నాడు.