పూరీకి మద్ధతుగా మెగాహీరో | Varun Tej on Puri Jagannadh's involvement in drugs issue | Sakshi
Sakshi News home page

పూరీకి మద్ధతుగా మెగాహీరో

Published Thu, Jul 20 2017 2:11 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

పూరీకి మద్ధతుగా మెగాహీరో - Sakshi

పూరీకి మద్ధతుగా మెగాహీరో

బుధవారం సిట్ విచారణ తరువాత సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ పెట్టిన మెసేజ్ కు భారీ స్పందన వస్తుంది. ఎప్పుడు డేరింగ్ గా కనిపించే పూరి ఎమోషనల్ కావటంతో అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల సైతం పూరికి మద్దతిస్తున్నారు. ముఖ్యంగా పూరితో కలిసి పనిచేసిన వారు ఆయన చాలా మంచి వ్యక్తి అని సర్టిఫికేట్ ఇస్తున్నారు.

ప్రస్తుతం ఫిదా మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ కూడా పూరీకి మద్దుతుగా నిలిచాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమాలో నటించిన వరుణ్, ఆయన చాలా మంచివాడన్నాడు. తన ఆరోగ్యం మాత్రమే కాదు ఇతరుల ఆరోగ్యం గురించి కూడా పూరీ శ్రద్ద తీసుకుంటాడని అలాంటి వ్యక్తిపై డ్రగ్స్ వినియోగిస్తున్నాడన్న ఆరోపణలు రావటం తనను షాక్ కు గురిచేసిందన్నాడు.

ప్రస్తుతం సినీ ప్రముఖులకు నోటీసులు మాత్రమే అందాయన్న వరుణ్ తేజ్, ఈ విషయాన్ని డ్రగ్స్ స్కాండల్ అనొద్దని కోరాడు. లోఫర్ సినిమా షూటింగ్ లో ఉండగా పూరీ ఎప్పుడు డ్రగ్స్ జోలికి వెళ్లటం చూడలేదన్న వరుణ్, మంచి మార్గంలో సంతోషంగా ఉండటం ఎలాగో పూరికి తెలుసునన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement