సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ లైన్‌పై కామెంట్లు | Mahesh Comments on Super Star Tagline | Sakshi
Sakshi News home page

రజనీ, చిరు.. రియల్‌ సూపర్‌స్టార్లు : మహేష్‌

Published Mon, Sep 25 2017 12:19 PM | Last Updated on Mon, Sep 25 2017 12:19 PM

Mahesh Comments on Super Star Tagline

సాక్షి, సినిమా :  స్పైడర్‌ ఫీవర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడును షేక్‌ చేస్తోంది. మహేష్‌ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ద్విభాష చిత్రంపై అంతకంటే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో స్పైడర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మహేష్‌.. ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నాడు. 

ఈ సందర్బంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. మాములుగానే ముక్కు సూటిగా సమాధానాలిచ్చే మహష్‌ ను ట్యాగ్‌ లైన్‌ గురించి ఓ విలేకరి ప్రశ్న అడిగారు. ఫ్యాన్స్‌ మిమల్ని సూపర్‌ స్టార్‌గా పిలుస్తుంటారు. మరి మీ దృష్టిలో అసలైన సూపర్‌ స్టార్‌ ఎవరు? అన్న ప్రశ్నకు చాలా నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. 

‘భారత చలన చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లలో నాకు తెలిసి రజనీకాంత్‌, చిరంజీవి గార్లే నిజమైన సూపర్‌ స్టార్లు. చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా థియేటర్లకు జనాలను రప్పించగలిగే సామర్థ్యం వాళ్లకు మాత్రమే ఉంది. కేవలం వాళ్లను తెరపై చూసేందుకే ఫ్యాన్స్‌ థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఆ ట్యాగ్‌ లైన్‌ వాళ్లకే ఫర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది’ అని మహేష్‌ బదులిచ్చారు. అయితే తన దృష్టిలో మాత్రం సినిమానే బిగ్‌ స్టార్‌ అని మహేష్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement