
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఓ అభిమాని సేవ్ శబరిమల క్యాంపెయిన్‌పై ఇప్పటికైనా నోరు విప్పండి అంటూ మనోజ్ ను ట్యాగ్‌చేస్తూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై స్పందించిన మనోజ్.. ‘మనం పేదలకు నీరు, ఆహారం, చదువు లాంటి కనీస అవసరాల తీర్చడం పై ముందుగా బాధపడాలి. మనకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆయన, తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడండి’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్.
Comments
Please login to add a commentAdd a comment